Header Banner

వైసీపీ పాలన వల్లే ఏపీ ఆర్థిక సంక్షోభం! అసెంబ్లీకి రాకుండా బయట విమర్శలు! వైసీపీ నాయకుల పిరికితనం కాదా?

  Tue Mar 04, 2025 16:50        Politics

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర ఆదాయం రూ.1,54,065 కోట్లు కాగా, ఖర్చు రూ.1,54,971 కోట్లు నమోదైనట్లు తెలిపారు. గత ప్రభుత్వ పాలన రాష్ట్రాన్ని ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతీసిందని, వైసీపీ పాలన రాష్ట్రాన్ని దయనీయ పరిస్థితిలోకి నెట్టేసిందని మండిపడ్డారు. ముఖ్యంగా, సాగునీటి ప్రాజెక్టుల కేటాయింపుల విషయంలో అనవసర ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. సీమ ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తే ఒక రకంగా, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు కేటాయిస్తే మరో రకంగా విమర్శలు రావడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు.


ఇది కూడా చదవండి: వైసీపీకి మరో ఎదురు దెబ్బ! కీలక నేత పార్టీకి గుడ్‌బై.. జనసేనలోకి..!

 

అసెంబ్లీ సమావేశాలకు రాకుండా బయట నుంచే విమర్శలు చేయడం సరైనదికాదని మంత్రి మండిపడ్డారు. చట్టాలు చేయడం, ప్రతిపైసా ఖర్చును ఆమోదించడం సభ బాధ్యత అని, అయితే కొందరు అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో వెలిగొండ ప్రాజెక్టు పూర్తయిందని ప్రకటించిన వారే, ఇప్పుడు నిధులు కేటాయించలేదని మాట్లాడటం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. కేవలం ఎన్నికల లబ్ధి కోసం ప్రాజెక్టులను ప్రారంభించి, ప్రజలను మోసగించారని అన్నారు. అభివృద్ధి పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లాలనే తపన తమదని, ఆర్థిక నిపుణులు, బ్యాంకింగ్ అధికారులతో చర్చిస్తూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర క్లిష్టంగా ఉన్నప్పటికీ, ప్రజలకు మంచి పాలన అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. గత ప్రభుత్వం తీసుకున్న అప్పులు, అత్యధిక వడ్డీపై చేయాల్సిన చెల్లింపులు ఇప్పుడు రాష్ట్ర ఖజానాపై భారంగా మారాయని వివరించారు. 141 రకాల రుణాలను తెచ్చి, వాటికి 13.4% వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితిని ఏర్పరిచారని మండిపడ్డారు. ఏపీ పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పు రూ.154 కోట్లకు చేరిందని, ఈ రుణ భారం రాష్ట్రాన్ని మరింత దెబ్బతీస్తోందని చెప్పారు.

 

ప్రస్తుతం రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య ఉన్న సమన్వయాన్ని చూసి కొన్ని వర్గాలు అసెంబ్లీకి రాలేకపోతున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వ లక్ష్యం సమాజ హితం కోసం సంపద సృష్టించడమేనని, గత ప్రభుత్వ పాలన కేవలం వ్యక్తిగత ప్రయోజనాలకే పరిమితమైందని ఆరోపించారు. కేంద్రంతో సత్సంబంధాలు రాష్ట్ర భవిష్యత్తును మెరుగుపరిచేందుకు కీలకమని, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు బ్యాంకర్లతో చర్చలు జరుగుతున్నాయని వివరించారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తల్లికి వందనంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేశ్‌! 2025-26లో రూ.9,407 కోట్లు కేటాయించినట్లు వెల్ల‌డి!

 

రాజమండ్రి గోదావరిలో పడవ ప్రమాదం! ఇద్దరు మృతి, 10 మంది...

 

గుడ్ న్యూస్.. ఒకప్పటి సంచలన పథకం తిరిగి తీసుకువచ్చిన సీఎం చంద్రబాబు! ఇకపై వారికి సంబరాలే..

 

వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్.. విడదల రజనికి బిగుస్తున్న ఉచ్చు! ఇక జైల్లోనే..?

 

వైసీపీ కి మరో షాక్.. వంశీకి మరోసారి రిమాండ్ పొడిగింపు! ఎప్పటివరకంటే?

 

తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయాణం! ఎలక్ట్రిక్ రైళ్లతో భారత్ ముందడుగు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #YCP_Financial_Crisis #AP_Economy #YSRCP_Failures #DebtBurden #AssemblyDebate #PeddalaPalana #TDPVsYCP #APBudgetCrisis #YSRCP_Corruption #EconomicMismanagement